calender_icon.png 1 July, 2025 | 10:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

01-07-2025 12:36:45 AM

 ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి

 మార్కెట్‌లో దళారీ వ్యవస్థకు చోటు లేదు

 గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

అబ్దుల్లాపూర్‌మెట్, జూన్ 30: రైతుల సంక్షమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. సోమవారం బాటసింగారం మార్కెట్ ఆఫీసులో సమీక్ష సమావేశం గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. మార్కెట్‌కు సంబంధించిన కార్యక్రమాలు, కొహెడలో నిర్మించబోయే మార్కెట్‌కు సంబంధించిన ప్రాజెక్టు పనులను పవర్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతుల సంక్షమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మార్కెట్‌లో అధిక కమిషన్లు వసూళ్లు చేసే వ్యాపారులను బ్లాక్ లిస్టులో పెట్టాలని.. అలాగే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గతంలో బాటసింగారం లాజిస్టిక్ పార్క్‌లో మార్కెట్‌ను ఏర్పాటు చేయగా.. కొంతమంది భూములు, షెడ్లను అధిక రేట్లకు లీజ్‌కు ఇచ్చార న్నారు. ప్రస్తుతం రేట్లను తగ్గించాలని లేని పక్షంలో మార్కెట్ పాలకవర్గం వాటి స్థానంలో కొత్త షెడ్లను నిర్మించుకోనున్నట్లు తెలిపారు.

కొహెడలో నిర్మించబోయే అధునాతన మార్కెట్‌కు త్వరలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిపారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా సమీకృత మార్కెట్‌ను నిర్మాణాలు ఉండబోతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి, వైస్ చైర్మన్ సీహెచ్ భాస్కర చారి, అడిషనల్ డైరెక్టర్ లక్ష్మణుడు, రీజినల్ జాయింట్ డైరెక్టర్ రవికుమార్, జిల్లా మార్కెటింగ్ అధికారి మహమ్మద్ రియాజ్, డీఈ రవీందర్, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎల్, శ్రీనివాస్, డైరెక్టర్లు జైపాల్ రెడ్డి, బండి మధుసూదన్ రావు, అంజయ్య, లక్ష్మి, మచ్చేందర్ రెడ్డి, రఘుపతి రెడ్డి, గణేష్ నాయక్, గోవర్ధన్ రెడ్డి, నవరాజ్, నర్సింహ, వెంకట్ గుప్తా, ఇబ్రహీం, సంబంధిత అధికారులు తదితరులుపాల్గొన్నారు.