calender_icon.png 1 July, 2025 | 7:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లేబర్స్ టార్గెట్‌గా గంజాయి సరఫరా

01-07-2025 12:32:33 AM

- ఒడిశాకు చెందిన ముగ్గురు అరెస్ట్ 

- 10 కిలోల గంజాయి స్వాధీనం 

చేవెళ్ల, జూన్ 30: కార్మికులే లక్ష్యంగా గంజాయి సరఫరా చేస్తు న్న ఒడిశా రాష్ట్రానికి చెందిన ము గ్గురిని రాజేంద్రనగర్ ఎస్ వోటీ, మోకిలా పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ వీరబాబు వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన శంకర్ గౌడ (27), శ్రీధర్ పరిద (19) హై దరాబాద్ లో మేస్త్రీ, లేబర్ గా పని చేస్తున్నారు. ఒడిశా నుంచి గంజాయిని తీసుకువచ్చి, హైదరాబాద్ లోని కార్మిక ప్రాంతాల్లో సరఫరా చేయాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే ఒడిశాకు చెందిన మిని నహక్ అలియాస్ జిలి గౌడ (34)అనే మహిళ అక్కడి నుంచి అక్రమంగా గంజాయి తీసుకొచ్చింది.

ఈ ముగ్గురు కలిసి ఆదివారం మొకిలా పీఎస్ పరిధిలోని ఇంద్రా రెడ్డి నగర్ వద్ద ఓ ఆర్ ఆర్ సర్వీస్ రోడ్డులో అక్రమంగా రవాణా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 10 కిలోల గంజాయి (5 ప్యాకెట్లు) 3 ఫోన్లు స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు. నిందితులు నేరాన్ని అంగీకరించడంతో ఎన్ డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి.. రిమాండ్ కు తరలించినట్లుసీఐతెలిపారు.