10 May, 2026 | 11:46 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

జూలై 4న ములుగులో మెగా జాబ్ మేళా

30-06-2025 05:24 PM

భూక్య జంపన్న ఆధ్వర్యంలో యువతకు ఉపాధి అవకాశాల పండుగ..

ములుగు (విజయక్రాంతి): ములుగు జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాలన్న సంకల్పంతో సామాజిక సేవకుడు బీఆర్ఎస్ జిల్లా నాయకులు భూక్య జంపన్న(BRS District Leaders Bhukya Jampanna) ఆధ్వర్యంలో జూలై 4న భారీ స్థాయిలో మెగా జాబ్ మేళా(Mega Job Fair) నిర్వహించనున్నారు. ములుగు ఎస్బిఐ రోడ్ భూక్య జంపన్న ఆఫీస్ యందు జరిగే ఈ కార్యక్రమంలో పలు ప్రఖ్యాత కంపెనీలు పాల్గొనబోతున్నాయి. ఈ జాబ్ మేళాలో 3,000కు పైగా ఖాళీలను భర్తీ చేయడానికి ఇప్పటికే పలు ప్రైవేట్ కంపెనీలు పాల్గొనేందుకు సిద్ధమయ్యాయి. సామాజిక రంగంలో చురుగ్గా ఉన్న భూక్య జంపన్న ఇప్పటికే  ఉచిత  కంటి  ఆపరేషన్ 1987 పైచిలుకు మంది పేద ప్రజలకు చేయించడం జరిగింది.

పలు ఆరోగ్య శిబిరాలు, విద్యా సహాయ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో విశ్వాసం సంపాదించుకున్నారు. ఇప్పుడు ఉపాధి అవకాశాల పరంగా కూడా ముందంజలోకి వచ్చారు. పేదవారికి విద్య, వైద్యం, ఉపాధి అందించడమే తన ప్రధాన లక్ష్యం అని అన్నారు“ పని చేసే చేతులకూ, అవకాశం కోసం ఎదురు చూస్తున్న కళ్లకూ ఒక వేదిక కావాలన్నదే ఈ జాబ్ మేళా ఉద్దేశ్యం,”అని భూక్య జంపన్న వెల్లడించారు.

అన్ని స్థాయిల ఉద్యోగాలకు అవకాశాలు

ఈ జాబ్ మేళాలో పదో తరగతి నుంచి బీటెక్, డిప్లొమా, డిగ్రీ, ఐటీఐ, పీజీ, విద్యార్హతలు కలిగిన అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు ఉండనున్నాయి. 

నేరుగా ఇంటర్వ్యూలు – వెంటనే ఆఫర్ లెటర్లు

మేళాలోనే సంస్థలు ఆన్-ద-స్పాట్ ఇంటర్వ్యూలు నిర్వహించి, అర్హులైన అభ్యర్థులకు అదే రోజు ఆఫర్ లెటర్లు అందజేయనున్నాయి. ఈ సందర్భంగా రిజ్యూమే ప్రిపరేషన్, కెరీర్ గైడెన్స్, స్కిల్ మాడ్యూల్స్ వంటి సేవలు కూడా అందించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

జంపన్న పిలుపు

ఈ సందర్భంగా భూక్య జంపన్న యువతను ఉద్దేశించి మాట్లాడుతూ... ఉపాధికి వెతకకూడదు, సృష్టించుకోవాలి. ఈ జాబ్ మేళా మీ భవిష్యత్‌కు దిశానిర్దేశం చేస్తుంది. మీ కెరీర్‌కి ఇది మొదటి మెట్టు కావచ్చు,అంటూ మేళాలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.

భూక్య జంపన్న నాయకత్వంలో జరిగే ఈ జాబ్ మేళా స్థానికంగా ఉపాధి అవకాశాల దిశగా కీలక అడుగుగా భావించబడుతోంది. జిల్లా యువత ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ భవిష్యత్తును మెరుగుపరచుకోవాలని కోరుతున్నారు.