calender_icon.png 30 June, 2025 | 11:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రావుల వెంకటేశ్వర్లు సేవలు మరువలేనివి..

30-06-2025 05:29:49 PM

మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు..

మునగాల: మండల పరిషత్ కార్యాలయానికి రావుల వెంకటేశ్వర్లు చేసిన సేవలు మరువలేనివని మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు(Former MLA Venepalli Chander Rao) అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఆవరణలో 39 సంవత్సరాలు సేవలందించి పదవి విరమణ పొందిన రావుల వెంకటేశ్వర్లు బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, స్థానికులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్(MPDO Ramesh Deen Dayal) మాట్లాడుతూ... పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నందు ఆఫీస్ సబ్ ఆర్డినేట్ గా విశిష్ట సేవలు అందించారు. 39 సంవత్సరాలు ఒకే దగ్గర అమూల్యమైన పనులు నిర్వర్తిస్తూ జిల్లా ఉత్తమ అవార్డును పొందినట్లు పేర్కొన్నారు.

సహ ఉద్యోగుల పట్ల క్రమశిక్షణ కలిగి ఉండి అమూల్యమైన పాత్రులు పోషించినట్లు వారు తెలుపుతూ ఎంపీడీవో ఆఫీస్ ను తన ఇల్లుగా భావించి రాత్రి పది గంటల వరకు కూడా పనిచేసిన రోజులు ఉన్నట్లు గుర్తు చేశారు. పదవి విరమణ పొందిన వెంకటేశ్వర్లకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగి ఉండి అతని సేవలు సమాజసేవలో రాణించాలని పలువురు కోరారు. ఈ కార్యక్రమంలో నల్లపాటి శ్రీనివాసరావు, కొప్పుల జాపాల్ రెడ్డి, సుంకర అజయ్ కుమార్, కాసర్ల కోటేశ్వరావు, బిందు నరేందర్ రెడ్డి, రజిత జానకి రెడ్డి, కాసర్ల శ్రీనివాస్, తొగర్ రమేష్, చింతకాయల ఉపేందర్, చందా చంద్రయ్య. కుటుంబ సభ్యులు బంధుమిత్రులు, తదితరులు పాల్గొన్నారు.