calender_icon.png 16 July, 2025 | 11:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భవానినగర్‌లో మెగా వైద్య శిబిరం

14-07-2025 12:39:05 AM

హనుమకొండ ,జూలై 13 (విజయ క్రాంతి): హనుమకొండ ఎన్జీవోస్ కాలనీ రోడ్డులోని భవాని నగర్ కమ్యూనిటీ హాల్లో భవాని నగరాకాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గురిజపల్లి ప్రకాశావు, ఉపాధ్య క్షుడు చాడా శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి సంపెట వీరయ్య గౌడ్ ల ఆధ్వర్యంలో ఆది వారం మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు.

ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ కె. నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్లు అజిత్ మహ్మద్, శిరీష్, డిప్రసన్నకుమార్, కె. రాజేశ్వరి, నరేష్కుమార్, రాంరెడ్డి, గీతాంజలి, వంశీ, సముద్రాల నరేష్  రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులతోపాటు కళ్లజోళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. 

స్థానిక కార్పొరేటర్ గుజ్జుల వసంత మహేందర్రెడ్డి, టీపీసీసీ సభ్యులు దొమ్మటి సాంబయ్య, చీటూరి అశోక్, కాంగ్రెస్ శ్రేణులు కేతిడి దీపకిరెడ్డి, తేళ్ల సుగణకిశోర్, ప్రొఫెసర్ రాంరెడ్డి, జితేందర్రెడ్డి  పాల్గొన్నారు. డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ అసిస్టెంట్ మేనేజర్ న్యాతగాని లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో రోగులకు కంటి వైద్యపరీక్షలు నిర్వహించి మందులు, కళ్లజోళ్లు ఉచితంగా అందజేశారు.