14-07-2025 12:39:59 AM
-అధికార ప్రతిపక్ష పార్టీల నేతలలో అసహనం
- ఎమ్మెల్యే, మాజీమంత్రి ఒకరిపై ఒకరు సవాళ్లు, ప్రతి సవాళ్లు
- గడువులోపు సమాధానం చెప్పాలంటున్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి డెడ్ లైన్లు
- జిల్లా వ్యాప్తంగా ఇరు పార్టీల నేతలలో తీవ్ర చర్చనీయాంశం
మహబూబ్ నగర్ జూలై 13 (విజయ క్రాంతి) : జడ్చర్ల నియోజకవర్గం లో జరుగుతున్న వర్షం పరిణామాలు చూస్తే మళ్ళీ ఎన్నికలు ఏమైనా జరుగుతున్నాయా ఇప్పు డు అనే పరిస్థితి నెలకొంది. అధికార పక్ష నేత లు ప్రతిపక్షాల నేతలు ఒకరిపై ఒకరు ప్రత్యేకంగా పేర్లు చెప్పుకుంటూ ఆరోపణలు చేయ డంతో ఈ చర్చ జిల్లా వ్యాప్తంగా పాకింది. అసలు జడ్చర్ల నియోజకవర్గం లో ఏమి జరుగుతుంది..? ఏమి జరగబోతుంది..? అనంతల జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి ఒకరిపై ఒకరు వ్యక్తిగత ఆరోపణలు సైతం చేసుకుంటున్నారు.
శాసనసభ ఎన్నికలకు ఎంతో స మయం ఉన్నప్పటికీ ప్రజా ప్రతినిధుల్లో మా త్రం జరగబోయే ఎన్నికలు శాసనసభ ఎన్నికలే అనంతల చేసుకుంటున్నా ఆరోపణలకు బలం చేకూరుతుంది. దీంతో జడ్చర్ల అంతట ఎవరిది తప్పు ఉంటుంది..మరి ఎవరు ఒప్పు చేసి ఉంటారు.. అనే చర్చ తీవ్ర రూపం దాల్చుతుంది. ఎందుకు ప్రత్యేక కారణాలు లేకపోలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు.
- వ్యక్తిగత ఆరోపణలు బహిర్గతం చేసుకుంటున్న నేతలు..
గడిచిన బి ఆర్ ఎస్ హయాంలో మాజీ మంత్రిగా ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన ల క్ష్మారెడ్డి తన సొంత అక్క పేరుపై రెండు ఎకరాల భూమి ఉందని, బాలనగర్ నుంచి గం గాపూర్ వరకు వెయ్యనున్న రోడ్డు మంజూ రు మాజీ మంత్రి తీసుకురాలేదని, జడ్చర్ల పట్టణంలోని పాత బజారుకు రోడ్డు గత ప్రభుత్వ హయాంలోనే లేదని, రోడ్డు విస్తరణలో భాగంగా ఇండ్లు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇప్పించడంలో అలసత్వం ప్ర దర్శించారని, రోడ్డు విస్తరణలో బిఆర్‌ఎస్ నే తలు ఎవరైతే ఉన్నారో వారి ఇంటి దగ్గర త క్కువ విస్తీర్ణం రోడ్డు విస్తరణ చేశారని ఇలా పలు ప్రశ్నలను సంధిస్తూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నిర్ణీత గడువు సమయంలో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గ డువులోపే స్పందించి మీరు నాకు గడువు ఇచ్చేది ఏమిటని నేనే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి గడువు ఇస్తున్నానని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పలు ప్రశ్నలను సంధించారు.
జడ్చర్లలో ని ప్ర భుత్వ ఆసుపత్రి దగ్గర మా అక్క పేరుపై పది గుంటల భూమి మాత్రమే ఉందని ఆ విషయాలు కూడా కొ ట్టు పరిధిలో ఉన్నాయని, బాలనగర్ నుంచి గంగాపూర్ వరకు డిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే రోడ్డు మంజూ రు కావడం జరిగిందని ఎందుకు నా దగ్గర బలమైన సాక్షాలు ఉన్నాయని తెలిపారు, జ డ్చర్ల సిగ్నల్ గడ్డ నుంచి పాత బజారుకు బా జాప్త వాహనాలు వెళ్లేందుకు మార్గం ఉంద ని, పోలేపల్లి సెజ్‌లోని కంపెనీల నుంచి మా జీ మంత్రి లక్ష్మారెడ్డి ఖాతాలో డబ్బులు వేపించుకోవడం జరిగిందని జడ్చర్ల ఎమ్మె ల్యే అనిరుద్ రెడ్డి ఏడు రోజుల్లో సమాధా నం చెప్పాలని జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే కు స వాల్ విసిరారు.
పట్టణంలో రోడ్డు విస్తరణ లో బిఆర్‌ఎస్ నేతలు ఉన్న ఇంటి దగ్గరనే టే పు పట్టి ప్రత్యేకంగా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి రోడ్డును కొలిచి 50 ఫీట్లు కాదు 53 ఫీట్లు ఉందని జడ్చర్ల ఎమ్మె ల్యే అనిరుద్ రెడ్డి కి బ హిరంగంగానే తెలియజేశారు. పోలేపల్లి సెజ్ కంపెనీల నుంచి తమ ఖాతాలోకి డబ్బులు పడ్డాయని ఎమ్మె ల్యే ఆరోపించడం ఇంతవరకు సమంజసం అని ఏమైనా ఆధారాలు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. ఎ మ్మెల్యే సంధించిన ప్రతి ప్రశ్నకు తాను స మాధానం చెప్పేందు కు సిద్ధంగా ఉన్నానని, నేను వేసిన ప్రశ్నలకు పది దినాలు కాకుంటే మరో 10 రోజులు ఎ క్కువ తీసుకొని సవిధానంగా సమాధానాలు చెప్పాలని, దొంగ తిరుగుడు మాటలు మాట్లాడి సమాధానా లు దాటవేయడం మంచి పద్ధతి కాదని గడు వు విధించారు. ఇలా ఒకరిపై ఒకరు వివిధ ప్రశ్నలను సంధిస్తూ గడువులు విధించడంతో జడ్చర్ల నియోజకవర్గంలో పలు అం శాలు హాట్ టాపిక్‌గా మారాయి.
-నేను గడువిస్తున్న నీకు.. కాదు నేనే గడువిస్తున్న నీకు
జడ్చర్ల నియోజకవర్గంలో అంశాలు ఏవై నా ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలతో ప్రజలు మరిం త ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ సవాళ్లు ప్రతి సవాళ్లు ముగింపు పలుకుతాయా లేక నెలల తరబడి ఇలానే ముందుకు సాగుతాయని ప్రశ్న కూడా జడ్చర్ల నియోజకవర్గం ప్రజల కు మెదులుతుంది. ఒకరి తప్పంటే మరొకరు మీదే తప్పంటూ ఆరోపణలు చేసుకుం టే జరగాల్సిన అభివృద్ధిపై ప్రభావం పడే అ వకాశాలు ఉంటాయని పలువురు మేధావులు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నా రు.
గెలిచిన ఓడిన జడ్చర్ల నియోజకవర్గానికి మేలు చేసేలా నేతల తీరు ఉండాలని ఒకరిపై ఒకరు ఆరోపణ చేసుకుంటే వచ్చేదేముంది అంటూ ప్రజలు పలు ప్రశ్నలను సంధిస్తున్నారు. ఇకనైనా ఈ ప్రక్రియకు ముగింపు ప లికాలని ఇరువురిని కోరుతున్నారు. మరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈ ఆరోపణలకు ముగింపు పలుకుతారా లేదా చూడాలి.