14-07-2025 12:35:21 AM
అబ్దుల్లాపూర్‌మెట్, జులై 13: పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ తట్టి అన్నారం నుంచి కుంట్లూరుకు వెళ్లే రహదారి పొడువునా ఉన్న మూల మలుపులు ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. ఈ రోడ్డు ప్రధానంగా పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ నుంచి నాగోల్ చౌరస్తా లింక్ రోడ్ కలుస్తుంది. దీంతో ఈ రోడ్డు ప్రతినిత్యం అత్యంత రద్దీగా ఉంటుంది. వందలాది ద్విచక్ర వాహనాలతో పాటు ఫోర్ వీలర్ వాహనాలు రాకపోకలతో హైవేను తలపించేలా ఉంటుంది.
ఈ రహదారిలో మూల మలుపులు ఎక్కువగా ఉండడంతో ప్రతినిత్యం ఏదో ఒక్క చోట ప్రమాదాలు నిత్యాకృతమవుతున్నాయి. ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడటంతో పాటు క్షతగాత్రులు గురవుతున్నారు. మలుపుల వద్ద రోడ్డు విస్తరణ, ఎలాంటి ప్రమాదాల కు సంబంధించిన హెచ్చరిక కు భూతద్దంతో వేతికిన ఎక్కడ కనబడవు. ప్రమాదాలపై పలువురు స్థానికులు ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులకు విన్నవించిన స్పందించిన దాఖలాలు లేవని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కుంట్లూరు జేపీ ఇన్‌ఫ్రా కంపెనీ (ఆర్‌ఎంసీ ప్లాంట్) దాటగానే మూల మలుపు వద్ద గతంలో కారు నియంత్రణ కోల్పోయి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. కారులో ఉన్నవారు గాయాలతో బయటపడ్డారు. ఇదే మలుపు వద్ద తట్టిఅన్నారం నుంచి కుంట్లూరు అతివేగంగా వస్తున్న కారును తప్పించబోయే క్రమంలో ఆర్‌ఎంసీ వాహనం లారీ అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో డ్రైవర్ బలమైన గాయాలు అయ్యాయి.
ఈ మధ్యకాలంలో కుంట్లూరు నారాయణ కాలేజీ మూల మలుపు వద్ద రాత్రి సమయంలో రెండు కార్లు ఎదురెదురుగా బలంగా ఢీకొనడంతో రెండు కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ప్రమాదాలు దాదాపు గా రాత్రి సమయాల్లోనూ ఎక్కువగా సంభవిస్తుంటాయి. ఈ రహదారి గుండా అతివేగం గా రావడం... మూలమల్పును గమనించకపోవడంతో క్షణాల్లో ప్రమాదాలు కొనసాగుతున్నాయి. రోడ్డు ఇరువైపులుగా ఉన్న విద్యుత్ స్తంభాలకు వీధి దీపాలు లేకపోవడంతో ఈ దారంతా అంధకారంగా ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మూల మలుపుల వద్ద సూచిక బోర్డులు, వీధి దీపాలను ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను పలుసార్లు విన్నవించిన పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి మూ లమలుపుల వద్ద సూచిక బోర్డులు, రాత్రి వేళలో వీధి ఏర్పాటు చేయాలని స్థానిక వాసులు కోరుతున్నారు.
అధికారులు దృష్టి సారించాలె
కుంట్లూరుతట్టిఅ న్నారం వెళ్లే మార్గమధ్యలో మూల ములు పులున్నాయి. ఈ మలుపులవద్ద ఎలాంటి సూ చిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదా లు జరుగుతున్నాయి. ప్రమాదాల నివారణ కోసం సూచిక బో ర్డుల ఏర్పాటు, అలాగే వీధిదీపాలుకూ డాలేవు. ఈ స మస్యలపై అధికారుల దృష్టిసారించాలె.
పబ్బతి లక్ష్మణ్, తాజా మాజీ కౌన్సిలర్,
పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ
నివారణ చర్యలు చేపట్టాలె
తట్టి అన్నారం నుంచి కుం ట్లూరు వెళ్లే మా ర్గంలో ఎక్కువగా మలుపులుంటాయి. ఈ మలు పుల వలన ఎక్కువగా రోడ్ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రాత్రి అయితే చాలు ఈ రహదారంతా రాత్రి సమయంలో అంధకారంగా ఉంటుంది. ప్రమాదాల నివారణ కోసం సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలె.
దేవిడి వేణుగోపాల్‌రెడ్డి,
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు