19 June, 2026 | 2:42 AM

సభ్యత్వ నమోదు విజయవంతం చేయాలి

19-06-2026 12:15 AM

మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ 

మహబూబాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని, ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఎస్ ఐ ఆర్ కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ, క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు. గురువారం మహబూబాబాద్ లో నిర్వహించిన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో  ఎస్ ఐ ఆర్, సభ్యత్వ నమోదు కార్యక్రమంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

పార్టీ బలోపేతానికి సభ్యత్వ నమోదు కీలకమైన అంశమని, ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఈ రెండేళ్ల పాటు ప్రజలకు అండగా నిలిచి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.