24 May, 2026 | 2:13 PM

Breaking News

140 కోట్ల భారతీయుల ప్రయోజనాలే మాకు ముఖ్యం: విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌   •   అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం సమీపంలో కాల్పులు.. నిందితుడు మతి   •   పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం.. గోపాలరావుపల్లెలో సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ   •   ఘనంగా మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లా 2వ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ – 2026   •   మండలంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్   •   విద్యతోనే విద్యార్థులకు భవిష్యత్తు   •   పంట వ్యర్థాల దగ్ధంతో ఆందోళనలో పల్లె ప్రజలు   •   శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు   •   కోదాడ సమీపంలో రోడ్డు ప్రమాదం: ఆరుగురికి గాయాలు   •   నీలోఫర్ కేఫ్ పరిధిలో రెచ్చిపోయిన ఆకతాయిలు   •  

క్రీడలతో మానసిక ఉల్లాసం

11-11-2024 12:46 AM

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి

కామారెడ్డి, నవంబర్ 10 (విజయక్రాంతి): క్రీడలు మానసిక ఉల్లాసా న్నిస్తాయని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో కైసర్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో భారతరత్న మౌలానా అబ్దుల్‌కలాం ఆజాద్ మోమోరియల్ అథ్లెటిక్స్ పోటీలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమన మాట్లాడుతూ.. క్రీడాకారులు ఆటల్లో గెలుపోటములను లెక్కచేయకుండా పాల్గొనాలని కోరారు. అథ్లెటి క్స్ ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయన్నారు. క్రీడల్లో నైపు ణ్యతను సాధించేందుకు పోటీల్లో పాల్గొనాలని క్రీడాకారులకు సూచించారు.

అథ్లెటిక్స్‌లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను ఎమ్మె ల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో కైస్ అకాడమీ ప్రతినిధులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, మార గంగారెడ్డి, కాటిపల్లి నగేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.