క్రీడలతో మానసిక ఉల్లాసం
21-05-2024 03:01 AM
భూపాలపల్లి యువజన క్రీడా శాఖ అధికారి రఘు
జయశంకర్ భూపాలపల్లి, మే 20(విజయక్రాంతి): క్రీడలతో మానసిక ఉల్లాసం, దేహదారుఢ్యం పెంపొందుతాయని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి రఘు అన్నా రు. భూపాలపల్లి పట్టణంలో కొనసాగుతున్న తైక్వాండో వేసవి శిక్షణ శిబిరాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. సమ్మ ర్ క్యాంపులు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేశామని, క్రీడల్లో ఆసక్తి ఉన్నవారు చక్కగా వినియోగించుకోవాలని చెప్పారు. రఘు వెంట ఖేలో ఇండియా కబడ్డీ కోచ్ శ్రీనివాస్, తైక్వాండో డిస్ట్రిక్ట్ కోచ్ దిలీప్‌కుమార్ తదితరులు ఉన్నారు.






