26 August, 2026 | 4:08 AM

16 క్వింటాళ్ల బియ్యం పట్టివేత

21-05-2024 03:02 AM

రఘునాథపల్లి(జనగామ), మే 20 (విజయక్రాంతి): పెద్దమొత్తంలో రవాణా చేస్తున్న రేషన్ బియ్యాన్ని రఘునాథపల్లి పోలీసులు పట్టుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం దయ్యబండ తండాకు చెందిన వాంకుడోత్ మహేందర్, వాంకుడోత్ బుజ్జి  సోమవారం రఘునాథపల్లి మండలంలో 16 క్వింటాళ్ల రేషన్ బియ్యం కొనుగోలు చేశారు. వాటిని మహీంద్ర జీతో వాహనంలో తరలిస్తున్నారు. ఈ క్రమంలో రఘునాథపల్లి ఎస్సై నరేశ్  నిడిగొండ వద్ద వాహన తనికీలు చేస్తుండగా రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనం పట్టుబడింది. బియ్యంతోసహా వాహనాన్ని స్టేషన్‌కు తరలించారు. ఇద్దరిపై కేను సమోదు చేసినట్లు ఎస్సై            తెలిపారు.