7 March, 2026 | 12:26 PM

భిక్కనూరు పాఠశాల లోమానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం

06-03-2026 08:12 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఎక్సైజ్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల భిక్కనూర్‌లో పదవ తరగతి విద్యార్థులకు “మానసిక ఒత్తిడి–అధిగమించే మార్గాలు”పై అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు.

జిల్లా మానసిక ఆరోగ్యాధికారి డా. రమణ మాట్లాడుతూ పరీక్షల సమయంలో విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలని సూచించారు. ఎక్సైజ్ ఎస్సై దీపిక మత్తుపదార్థాల ప్రమాదాలపై అవగాహన కల్పించారు. సైకియాట్రిక్ సోషల్ వర్కర్ డా. రాహుల్ టెలి మానస్ సేవల గురించి వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఆరోగ్య శాఖ, ఎక్సైజ్ శాఖ సిబ్బంది, సుమారు 350 మంది విద్యార్థులు పాల్గొన్నారు.