ఐరాస సర్వసభ్య సమావేశానికి ఎంపికైన విద్యార్థికి ఎంఈఓ సన్మానం
అయిజ మార్చి 26 ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమా వేశంలో ఉపన్యాస పోటీలో రాష్ట్రస్థాయికి ఎన్నికైన అయి జ విద్యార్థి రవిచంద్రను తెలంగాణ సోషల్ ఫోరం అధ్యక్షులు పాల్వాయి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారి రాములు దయాల్ గురువారం ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా రాములు దయాల్ మాట్లాడుతూ తెలంగాణ మోడల్ యునైటెడ్ నేషన్స్ కార్యక్రమంలో జిల్లాలోని 22 పి ఎం శ్రీ పాఠశాల నుండి 44 మంది విద్యార్థులు పాల్గొన్నారని, అందులో అయిజ బాలుర ఉన్నత పాఠశాల నుండి రవీంద్ర రాష్ట్ర స్థాయిలో ఎంపికైనందుకు చాలా గర్వంగా ఉందని అన్నారు. చాలామంది పెద్దపెద్ద మేధావులు సైతం ప్రభుత్వ పాఠశాలల నందు విద్యనభ్యసించి దేశం గర్వించే స్థాయికి దిగారని ప్రతి విద్యార్థిని విద్యార్థి కూడా వారిని ఆదర్శంగా తీసుకొని ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శేష ఫణి శర్మ, రాజేందర్ రెడ్డి, భాస్కర్, నరసింహులు, లక్ష్మన్న, మంజులవాణి,ప్రభ, సుధారాణి మొదలగు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.




