రాజాసాబ్ వాయిదా?
ప్రభాస్ ప్రస్తుతం ‘కల్కి 2’, ‘రాజాసాబ్’ తదితర చిత్రాల్లో నటిస్తున్నారు. ‘రాజాసాబ్’ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల చేస్తామంటూ మేకర్స్ ఒక పోస్టర్‌తో గతంలో అధికారిక ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ సినిమా వాయిదా పడిందంటూ ప్రచారం జోరుగా జరుగుతోంది. అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ తన కొత్త సినిమాను అదే తేదీన విడుదల చేస్తున్నట్టు ప్రకటించడంతో క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్దు ‘జాక్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు.
ఈ చిత్రంలో వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకోవడంతో రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఏప్రిల్ 10న విడుదల చేస్తున్నామని ‘జాక్’ మేకర్స్ ప్రకటించడంతో ‘రాజాసాబ్’ వాయిదా పడినట్టేనని అంతా ఫిక్స్ అవుతున్నారు. ‘రాజాసాబ్’ విడుదలయ్యేలా ఉంటే సిద్దు అదే తేదీన తన సినిమాను విడుదల చేయరని అంటున్నారు. ‘రాజాసాబ్’ వాయిదాకు ప్రభాస్ గాయమే కారణమని అంటున్నారు. ప్రభాస్ కాలికి సర్జరీ కోసం త్వరలోనే ఇటలీ వెళుతున్నాడట. జనవరి చివరి వారంలో ఇండియాకు తిరిగొస్తాడట. ఈ క్రమంలోనే ‘రాజాసాబ్’ను వాయిదా వేశారట.






