25 May, 2026 | 1:46 AM

అర్ధరాత్రి కారు రేసింగ్

25-05-2026 12:45 AM

పోలీసులపైకి దూసుకెళ్లిన కారు, కానిస్టేబుల్‌కు గాయాలు

రాయదుర్గంలో యువకుల హల్‌చల్!

శేరిలింగంపల్లి, మే 24 (విజయక్రాంతి): హైదరాబాద్ ఐటీ కారిడార్‌లోని రాయదుర్గం టీ-హబ్, నాలెడ్జ్ సిటీ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి యువకులు కార్లు, బైకులతో రేసింగ్‌కు పాల్పడి హంగామా సృష్టించారు. భారీ శబ్ధాలతో ఉన్న సైలెన్సర్లతో అధిక వేగంగా, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ స్థానికులు, వాహనదారులను భయభ్రాంతులకు గురిచేశారు.

సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రేసింగ్‌ను అడ్డుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో కారును ఓ యువకుడు ఆపకుండా పోలీసులపైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ రమేష్ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. అప్రమత్తమైన పోలీసులు కారు అద్దాలను ధ్వంసం చేసి, డ్రైవర్ రేహాన్(19)ను అదుపులోకి తీసుకున్నారు.

కారు, ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను చూసి మిగతా రేసర్లు పరార య్యారు. వారి కోసం గాలింపు చేపట్టారు. కేసు నమోదు చేసినట్లు రాయదుర్గం పోలీసులు తె లిపారు. టీ-హబ్, ఐక్యా, మై హోమ్ భుజ వంటి ప్రాంతాల్లో నైట్ రేసిం గ్లు తరచుగా జరుగుతుండటంతో స్పెషల్ డ్రైవ్‌లు చేపట్టామన్నారు. ఇలాంటి చర్యలు ప్రాణాంతక రోడ్డు ప్రమాదాలకు దారితీస్తాయని, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.