25 May, 2026 | 1:46 AM

జూలై 5న టీఆర్పీ బహిరంగ సభ

25-05-2026 12:47 AM

భువనగిరిలో లక్ష మందితో నిర్వహిస్తాం: రాష్ట్ర కమిటీ 

హైదరాబాద్, మే 24 (విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం ఆదివారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాధం రజినికుమార్‌యాదవ్ అధ్య క్ష టతన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయా లు తీసుకున్నారు. జూలై 5వ తేదీన భువనగిరి జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారు.

సభ ఏర్పాట్లపై రాష్ట్ర కమిటీ సభ్యుల నుంచి సూచనలు, సలహాలను మాధం రజినికు మార్‌యాదవ్ తెలుసుకున్నారు. సభ నిర్వహణ బాధ్యతలను పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న ఆదేశానుసారం పార్టీ ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్‌కు అప్పగిం చారు. సభ ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించేందుకు పలు కమిటీలను ఏర్పాటు చేసి, ఆయా కమిటీలకు కీలక బాధ్యతలు అప్పగించారు.

సభను కనివిని ఎరుగని రీతిలో నిర్వహించాలని, లక్ష మందికి పైగా ప్రజలను సమీకరించాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని సమావేశంలో నిర్ణయించారు. కార్యక్ర మంలో పార్టీ ఉపాధ్యక్షుడు ఎల్లబోయిన ఓ దెలు యాదవ్, ప్రధాన కార్యదర్శి వేములవాడ మదన్మోహన్ చారి, ఉప కోశాధికారి కొక్కల కొండ మనోజ్,క్రమశిక్షణ కమిటీ చై ర్మన్ బందారపు నరసయ్య గౌడ్, రాష్ట్ర మ హిళా అధ్యక్షురాలు పటేల్ వనజ, మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లంకొండ నీరజ గౌడ్, రాష్ట్ర కార్యదర్శులు పసల ప్రసన్న, మన్నె రమేష్ యాదవ్, కొమ్ముల ప్రవీణ్ రాజ్, ఆ కుల హనుమాన్లు, యూత్ విభాగం అధ్యక్షులు బొడ్డుపల్లి చంద్రశేఖర్, సోషల్ మీడి యా రాష్ట్ర కన్వీనర్ మనోజ్‌ఆకుల, తదిత రులు పాల్గొన్నారు.