24 March, 2026 | 2:30 AM

అదంతా ఉత్తదే!

24-03-2026 12:53 AM
  1. 10 కిలోల ఎల్‌పీజీ సిలిండర్లపై కేంద్రం స్పష్టం
  2. వదంతులపై పెట్రోలియం మంత్రిత్వ శాఖ వివరణ

న్యూఢిల్లీ, మార్చి 23: ఎల్పీజీ సిలిండర్ బరువును 14.2 కేజీల నుంచి 10 కిలోలకు తగ్గించనున్నట్లు వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలేనని, కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు 10 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ల వందంతులపై సోమవారం పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతశర్మ వివరణ ఇచ్చారు. పశ్చిమాసియాలోని తీవ్ర ఉద్రిక్తతల వల్ల ఏర్పడిన వంటగ్యాస్ కొరతను నివారించడానికి చమురు సంస్థలు సిలిండర్ బరువును తగ్గించే యోచనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

గృహ వినియోగానికి 10 కేజీల ఎల్పీజీ సిలిండర్లను పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ప్రస్తుతం గృహ అవసరాలకు 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్లను పంపిణీ చేస్తున్నారు. దీనిని 10 కిలోలకు తగ్గించి, పంపిణీకి యోచిస్తున్నట్లు వదంతులు రావడంతో అలాంటిదేమీ లేదని కేంద్రం స్పష్టం చేసింది.