సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
చొప్పదండి, ఆగస్టు 9 (విజయక్రాంతి): నారాయణపూర్ రిజర్వాయర్ అభివృద్ధికి రాష్ట్ర ప్ర భుత్వం 20 కోట్లు మంజూరు చేయడం పట్ల చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎ మ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటాలకు నాయకులు, కార్యకర్తలు, రైతులు పాలాభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంత్రి మహేందర్, జవ్వాజి హరీష్, గోగూరి నాగభూషన్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్లు కోల రమేష్, సురేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని ఎల్లేశ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుబ్బాసి బుచ్చయ్య, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు ముద్దం నగేష్, కడారి మల్లేశం, నాయకులు పురుమల్ల మనోహర్, చిలువేరి నారాయణ, రోమాల రమేష్,సాగి అజయ్ రావు, తదితరులు పాల్గొన్నారు.






