24-05-2025 12:00:00 AM
మంచిర్యాల, మే 23 (విజయక్రాంతి) : మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని మంచిర్యాల మార్కెట్ ఏరియాలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, పవర్ సిస్టం, సెంట్రల్ లైటింగ్, రోడ్ల పనుల నిర్మాణం కోసం రూ.78 కోట్లు మం జూరు చేసినందుకు శుక్రవారం మంచిర్యాల మార్కెట్ ఏరియాలోని అర్చన టెక్స్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంచిర్యాల ఎమ్మె ల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చిత్ర పటాలకు పాలాభిషేకం చేసి, టపాకాయలు కాల్చి సంబరాలు జరిపారు.
ఈ సందర్భంగా కాం గ్రెస్ పార్టీ నాయకులు, వ్యాపారులు మాట్లాడుతూ మంచిర్యాల అభివృద్ధి ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు ఆలోచనలో భాగమేనని, మంచిర్యాలను రాష్ట్రంలోనే మోడల్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమం లో వ్యాపారస్తులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకు రా లు, యువజన కాంగ్రెస్ నాయకులు, విద్యా ర్థి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.