02-05-2025 12:55:44 AM
వనపర్తి టౌన్ మే 1: మైనర్ బాలికను అత్యాచారం చేసిన కేసులో నిందితునికి 20 సంవత్సరాలు కఠిన కారాగారా జైలు శిక్ష రూ -25,000/- జరిమాన విధించిన వనపర్తి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం ఆర్, సునీత.కొత్తకోట పోలీస్టేషన్ పరిధిలోని సంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సమీప బంధువు చిన్నన్నాన్నమ్మ చనిపోవడంతో దిన కార్యాలలో పాల్గొ నేందుకు పాఠశాల నుండి వచ్చిన మైనర్ బాలికపై అదే సంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జి, చెన్నయ్య, అనే వ్యక్తి ఒంటరిగా పడుకున్న అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ సంఘటన ఫిర్యాదు దారు తేది:18-05-2021 రాత్రి ఒంటరిగా పండుకున్న మైనర్ బాలికపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడినట్లు కొత్తకోట పోలీ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలిక ఫిర్యాదు మేరకు సంఘటన జరిగిన ప్రాంతంలో ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు సేకరించారు.విద్యార్థిని కుటుంబ సభ్యులు దిన కార్యాలను కానాయిపల్లి శివారులోని శివాలయంలో నిద్ర చేయుటకు వెళ్లారు అదే రోజు రాత్రి భోజనం చేసిన అమ్మాయి అత్త, మామ బాబాయి లతో కలిసి ఇంటి ముందు పడుకున్నారు.
వారిని గుర్తించిన నేరస్తుడు చెన్నయ్య నిద్రపోతున్న అమ్మాయి దగ్గరికి వెళ్లి నోట్లో చున్నీ కుక్కి బలవంతంగా అక్కడనుండి తమ ఇంట్లోకి ఎత్తుకెళ్లి శారీరకంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.నిద్రలో మేల్కొన్న మామ అత్త ఇరువురు లేచి అమ్మాయి కోసం వెతుకుతుండగా నేరస్థుడు భయంతో వదిలిపెట్టి పారిపోయాడు ఇది గుర్తించిన చుట్టు ప్రక్కన వారు తమ సమీప బంధువులు పోలీసులకు సంఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులకు తెలియజేశారు.
దీనిలో భాగంగా సాంకేతికంగా అవసరమైన ఆధారాలను సేకరించి నివేదికను తయారుచేసి కోర్టు లో చార్జీషీట్ దాఖలు చేశారు.కేసు పూర్వాపరాలను పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోర్టులో వాదనలు వినిపించగా నేరస్తునిపై నేరం నిరూపణ అయినందున ఈ రోజు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం ఆర్ సునీత తీర్పు వెలువరించడం జరిగిందని ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు.ఈ కేసులో నేరస్తులకు శిక్ష పడడంలో బాగా పనిచేసిన పోలీస్ అధికారులను, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను, కోర్టు డ్యూటీ ఆఫీసర్లను ఎస్పీ గారు అభినందించి త్వరలో రివార్డు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.