calender_icon.png 7 February, 2026 | 10:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం

07-02-2026 12:00:00 AM

ముషీరాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమ కారులకిచ్చిన హామీలను ఈనెలలో అమలు చేయనున్నారని సమాచారంతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్‌ల చిత్ర పటాలకు తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం(టీయూఎఫ్) ఆధ్వర్యంలో శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో పాలాభిషేకం చేశారు.

ఈ సందర్బంగా ఫోరం చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ మాట్లాడుతూ కెసిఆర్ తెలంగాణ ఉద్యమ కారులను పూర్తిగా విస్మరించితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమ కారులకి 250 గజాల ఇంటి స్థలం పెన్షన్ సౌకర్యం హామీలను పెట్టటం జరిగిందని అన్నారు. ఇచ్చిన హామీల అమలపై టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గత శాసన మండలిలో ప్రస్తావించినట్లు చెప్పారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ హామీలను అమలకు సీఎం దృష్టికి తీసుకెళతామని ప్రకటించారాని తెలిపారు. ఈనెల లో హామీల అమలును ప్రారంభించాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారంతో పాలాభిషేకం చేసినట్లు చెప్పారు. ఈ సమావేశం లో దయానంద్, జగన్ యాదవ్, కొండా స్వామి, నాగ జ్యోతి, రజనీకాంత్, సంద్యారెడ్డి, జయ, సమ్మెట గౌడ్, బింగి రాజు భూపాల్, బాల నరసింహ పాల్గొన్నారు.