28 July, 2026 | 4:28 AM

ఎంఐఎం పార్టీ నేతపై కాల్పులు

28-05-2024 12:33 AM

ఛాతిపై, కాలుకు గాయాలు

మహారాష్ట్రలో ఘటన

న్యూఢిల్లీ, మే 27: మహారాష్ట్రలో ఎంఐఎం పార్టీ నేతపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. సోమవారం తెల్లవారుజామున 1.20 గంటల సమయంలో నాసిక్ జిల్లాలో ఓ పెట్రోల్ బంక్ సమీపంలో మాలెగావ్ మాజీ మేయర్ అబ్దుల్ మాలిక్‌పై బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మూడు రౌండ్ల కాల్పులు జరిపినట్లు మాలెగావ్ నగర పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనలో అతని ఛాతిపై, కాలుకు గాయాల కాగా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు పేర్కొన్నారు. పాత ఆగ్రా రోడ్డులోని ఓ దుకాణం బయట మాలిక్ కూర్చొని ఉండగా ఈ ఘటన జరిగిందని, విచారణ జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఆల్ ఇండియాఈ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) పార్టీకి మాలిక్ ప్రముఖ నాయకుడిగా ఉన్నారు.