28 July, 2026 | 3:41 AM

ఐఆర్‌ఎస్ అధికారి ఫ్లాట్‌లో మహిళ డెడ్‌బాడీ

28-05-2024 12:37 AM

డేటింగ్ యాప్ ద్వారా ఇద్దరికీ పరిచయం

మహిళ తండ్రి ఫిర్యాదుతో అధికారిపై కేసు నమోదు 

లక్నో, మే 27 : ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్‌ఎస్) అధికారికి డేటింగ్ యా ప్‌లో ఒక మహిళ పరిచయమైన ఓ మహిళ.. మూడు నెలలకే అతడి ఫ్లాట్‌లో శవమై కనిపించింది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్లే.. ఉత్తరప్రదేశ్ నోయిడా సెక్టార్ 100లోని లోటస్ బౌలేవార్డ్ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఐఆర్‌ఎస్ అధికారి సౌరబ్ మీనా నివ సిస్తున్నారు. ఆయనకు బీహెచ్‌ఈఎల్‌లో హెచ్‌ఆర్‌గా పనిచేస్తున్న శిల్పా గౌతమ్ డేటిం గ్ యాప్ ద్వారా పరిచయమైంది. ఏం జరిగిందో తెలియదు గానీ శనివారం మధ్యా హ్నం శిల్పా గౌతమ్.. ఐఆర్‌ఎస్ ఆఫీసర్ సౌరబ్ మీనా ఫ్లాట్‌లో ఉరివేసుకుని కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శిల్పా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. శిల్పా, సౌరబ్‌ల మధ్య గత మూడే ళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డేటింగ్ యాప్ ద్వారా వీరికి పరిచయం ఏర్పడిందని, త్వరలోనే పెళ్లి చేసుకుంటానని నమ్మించి సౌరబ్ తన కుమార్తెను మోసం చేసినట్టు మృతురాలి తండ్రి గౌతమ్ తెలిపారు. ఈ కారణంగా వీరి మధ్య గతకొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయని, అందుకే ఆమెను భౌతికంగా వేధించడంతో పాటు చివరకు హత్య కూడా చేశాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మరోవైపు శిల్పా తండ్రి ఆరోపణలను సౌరబ్ ఖండించాడు. తమకు మూడు నెలల కిందటే డేటింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడిందని, ఆమె తల్లిదండ్రులు చెబుతున్న మూడేళ్ల క్రితం కాదని స్పష్టం చేశాడు. కాగా, మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, సౌరభ్‌ను అదుపులోకి తీసుకున్నారు. శిల్పా మరణంపై దర్యాప్తు చేస్తున్నట్లు నోయిడా అడిషనల్ డీసీపీ మనీష్ కుమార్ మిశ్రా తెలిపారు. పోలీసులు సౌరబ్‌ను కోర్టులో హాజరుపరచగా.. కోర్టు అతనికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది. కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు డిసీపీ మిశ్రా పేర్కొన్నారు. శిల్పా మృతికి గల కారణాలను తెలుసుకోవడానికి పోస్ట్‌మార్టం నివేదిక రావాల్సి ఉందని, ఈలోగా శిల్పా సౌరబ్‌ల మొబైల్ ఫోన్‌లను, సీసీటీవీ ఫుటేజీనిపరిశీలిస్తున్నట్లు స్పష్టం చేశారు.