ఓట్లు తొలగించడానికి బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుంది
అవినీతి నిరూపిస్తే రాజీనామా చేస్తా!
మాజీ మంత్రులపై మరో మారు మంత్రి అడ్లూరి ఫైర్!
ధర్మపురి, జూన్ 15 (విజయక్రాంతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా నుండి ఓట్లు తొలగించి అధికారంలోకి రావడానికి కుట్ర చేస్తుందని, ఈ కుట్రను భగ్నం చేయాల్సిన బాధ్యత బూత్ లెవల్ పోలింగ్ ఏజెంట్లపై ఉందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మ ణ్ కుమార్ అన్నారు.
తెలంగాణ ప్రదేశ్ కమి టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఓటర్ల జాబితా ప్ర త్యేక సమగ్ర సవరణ (సర్)పై ధర్మపురి నియోజకవర్గ బూతు లెవెల్ పోలింగ్ ఏజెం ట్ల శిక్షణా కార్యక్రమం సోమవారం ధర్మపురి లోని ఎస్ హెచ్ గార్డెన్ లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓటు చోరీకి పాల్పడుతుందని అన్నారు. ఇందులో భాగంగా ఇటీవల వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఓటర్లను తొలగించడ మే ఎందుకు ఉదాహరణ అని మంత్రి అన్నారు. బీజేపీ చేపట్టిన ఓట్ల తొలగింపు కుట్రను అడ్డుకోవడానికి రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో బూత్ స్థాయిలో పోలింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చి ఓట్లు కాపాడాలని ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఎస్‌ఐఆర్ నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు.ఇందులో భాగంగా ధర్మపురి నియోజకవర్గంలో బూత్ లెవెల్ పోలింగ్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు.
అదేవిధంగా మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ చేస్తున్న ఆరోపణలపై మంత్రి అడ్లూరి మరో మారు స్పందించారు. ఇద్దరు నాయకులు అబద్దాలతో కాంగ్రెస్ పార్టీని బలహీనం చేయాలని చూస్తున్నారని మంత్రి అడ్లూరి అన్నారు. మాజీ మంత్రులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై ఉందని అన్నారు. వడ్ల కొనుగోలు, ఇసుక రవాణాలో తాను అవినీతికి పాల్పడ్డట్టు నిరూ పిస్తే రాజీనామా చేస్తానని మంత్రి అడ్లూరి మరో మారు సవాలు విసిరారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంఘనభట్ల దినేష్, మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మితో పాటు ధర్మపురి నియోజకవర్గంలోని అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వివిధ గ్రామాల సర్పంచులు మార్కెట్ కమిటీ చైర్మన్ తదితరులు శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు.






