16 June, 2026 | 4:12 AM

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

16-06-2026 02:44 AM

ముకరంపుర, జూన్ 15 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద మధ్యతరగతి విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే మా ద్యేయం అని బీజేపి రాష్ట్ర అధికార ప్రతినిధి నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో సోమవారం రోజు నగరంలోని 42వ డివిజన్ భగత్ నగర్ పోలీస్ క్వాటర్స్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ఘన స్వాగతం పలికారు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఇచ్చిన పిలుపు మేరకు బీజేపి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పోలీస్ క్వాటర్స్ ప్రభుత్వ పాఠశాలలో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. మొదటి రోజు పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు ఇష్టమైన బెలూన్లు, బొమ్మలు, వివిధ రకాల వస్తువులను అందించి...స్వీట్లు పంపిణీ చేస్తూ చిన్నారులకు ఘనంగా స్వాగతం పలికారు.

ఇప్పటికే గత రెండు రోజుల క్రీతమే పాఠశాల ఆవరణను శుభ్రపరిచి మంచి అహ్లాదకర వాతావరణం కల్పించగా మొదటి రోజు పాఠశాలకు వచ్చిన విద్యార్థుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ సంధర్బంగా డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ... విద్యార్థులు పాఠశాలలకు ఆనందంతో వచ్చేలా పరిశుభ్రమైన వాతావరణంలో విద్యను అభ్యసించాలనే గొప్ప లక్ష్యంతో మా నాయకులు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు ఈ పాఠశాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దామని తెలిపారు.

ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఆధునిక క్లాస్ రూములు, డిజిటల్ మరియు స్మార్ట్ క్లాసులు, స్వచ్ఛమైన తాగునీరు, డైనింగ్ హాళ్లు  మరుగుదొడ్ల వసతులను కల్పించామని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్య కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయని విధ్యా ఫలాలు విద్యార్థులకు పూర్తిగా అందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపి నాయకులు, డివిజన్ కు చెందిన ప్రజలు పాల్గొన్నారు.