19 August, 2026 | 5:20 AM

విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష

15-06-2024 04:35 PM

అమరావతి : రాష్ట్రంలోని సర్కారు బడుల్లో డ్రాప్ అవుట్స్, మౌలిక సదుపాయాలపై ఉన్నతాధికారులతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇంటర్ విద్యార్థులకు జూలై 15వ తేదీ లోగా పాఠ్యపుస్తకాలు అందజేయాలని ఆయన  ఆదేశించారు. ఏడాదిలోగా ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త చేపట్టాల్సిన పనులతో పాటు గత ప్రభుత్వ హయంలో అర్థంతరంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేసి విద్యార్థులకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించాలని చెప్పారు. సర్కార్ బడుల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా తీసి నాణ్యతమైన, రుచికరమైన భోజనంలో తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. పాఠశాలల్లో పారిశుద్ధ్యం నిర్వహణపై అధ్యయనానికి అధికారులకు మంత్రి లోకేష్ సూచనలు జారీ చేశారు.