calender_icon.png 12 November, 2025 | 8:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు ఆయిల్ పామ్ పంట వేయాలి : మంత్రి తుమ్మల

30-07-2024 01:17:16 PM

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో రైతు పటల రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమం జరుగుతుంది. రెండో విడత రైతు రుణమాఫీ నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం విడుదల చేయనున్నారు.సీఎం చేతుల మీదుగా 17 మంది రైతులకు చెక్కులను అందజేయనున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాతూ... కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటుందన్నారు. రూ.లక్షన్నర అప్పు ఉన్న రైతులందరికీ ఇవాళ రుణమాఫీ చేస్తున్నామని, ఒకే పంటకాలంలో రూ.31 వేల కోట్లు రుణమాఫీ చేస్తున్నామని మంత్రి తెలిపారు.

ఆగస్టులో రూ.2 లక్షల్లోపు ఉన్న రుణమాఫీని కూడా అమలు చేస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం పంటలబీమా ద్వారా రైతులకు అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. గతంలో కంటే భిన్నంగా రైతుభరోసా విధివిధానాలు త్వరలోనే ఏర్పాటు చేస్తామని, ఆయిల్ పామ్ పంట రైతులను వేయాలని, ఐదేళ్లలో 5 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ వేయాలని  మంత్రి తుమ్మల కోరారు. అనేక రాష్ట్రాలకు పామాయిల్ సరఫరా చేసే స్థాయికి మన చేరాలని, రైతే రాజు అనే నినాదానికి నిజమైన అర్థం చెబుతున్నామన్నారు. మన్మోహన్ సింగ్ హయంలో రూ.70 వేల కోట్లు రుణమాఫీ చేశామని మంత్రి నాగేశ్వర రావు పేర్కొన్నారు.