13 April, 2026 | 1:56 AM

కొత్తజంటను ఆశీర్వదించిన మంత్రి

13-04-2026 12:34 AM

మునిపల్లి, ఏప్రిల్12: మండలంలోని పెద్ద గోపారం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ, సీనియర్ జర్నలిస్టు బుర్కల పాండు సోదరుడు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు  బుర్కల రాజు తనుశ్రీ వివాహం వేడుక మునిపల్లి మండలం కంకోల్ గ్రామ శివారులో గల శ్రీ లక్ష్మీ కన్వెన్షన్ లో ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది.

ఈ వివాహ వేడుకకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్య అతిథిగా హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. మంత్రి వెంట జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, మండల అధ్యక్షుడు సతీష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు రసూల్ పటేల్, మాజీ ఎంపీపీ రామ్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, పోల్కంపల్లి సర్పంచ్ వీరేశం, పెద్ద గోపులారం సర్పంచ్ బొడ్డు మల్లేశం, మాజీ సర్పంచులు , మాజీ ఎంపీటీసీలు, ఆయా పత్రికల జర్నలిస్టులు, నాయకులు ఉన్నారు.