7 August, 2026 | 11:57 AM

కీచక ఎస్సై దురాగతానికి మంత్రి దుద్దిళ్లదే బాధ్యత

21-06-2024 12:03 AM

జెడ్పీ చైర్మన్ పుట్ట మధు

మంథని, జూన్ 20 (విజయక్రాంతి): కాళేశ్వరం కీచక ఎస్సై దురా గతానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బాధ్యత వహించాలని పెద్ద పల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు అన్నా రు. ఎస్సై వ్యవహరం ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరానికి మాయని మచ్చ గా మిగిలిందని చెప్పారు. గతంలో ఆసిఫాబాద్ జిల్లాలో సదరు ఎస్సై వ్యవహరంపై తమ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొని ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇక్కడ పోస్టింగ్ ఇప్పించారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులకు తాను సన్నిహితుడని ఎస్సై చెప్పుకొనే వాడని గుర్తుచేశారు. నియోజవర్గంలోని పోలీస్ స్టేషన్లు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మారుతున్నాయని దుయ్యబట్టారు.  సమావేశంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శంకర్‌గౌడ్, కౌన్సిలర్ సమ్మయ్య, రాజే షం, సత్యనారాయణ పాల్గొన్నారు.