calender_icon.png 27 October, 2025 | 10:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ డోకా కార్డు విడుదల చేసిన మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి

27-10-2025 07:07:21 PM

సిద్దిపేట రూరల్: బీఆర్ఎస్ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖమంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి అన్నారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, బుస్సాపూర్ మాజీ సర్పంచ్ కేదారి సదాశివ రెడ్డి రూపొందించిన బీఆర్ఎస్ డోకా కార్డును హైదరాబాద్ లో మంత్రి వివేక్ ఆవిష్కరించారు. ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు, తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ సీఎం హోదాలో ఇచ్చిన హామీలు ఏ రకంగా తుంగలోతొక్కి ప్రజలను మోసం చేసి డోకా ఇచ్చారో వివరిస్తూ డోకా కార్డును రూపొందించిన ట్లు సదాశివరెడ్డి తెలిపారు. వారు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రాష్ట్రన్ని అప్పులకుప్పగా మార్చి, వారు మాత్రం ఆస్తులు పెంచుకున్నారని ఆరోపించారు.