27-10-2025 07:09:02 PM
వీర్నపల్లి (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో వీర్నపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీవోగా బి శ్రీలేఖ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆమె గ్రామ పంచాయతీ కార్యదర్శిగా, జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తూనే గ్రూప్-1 పరీక్ష రాసి విజయం సాధించి ఎంపీడీవో ఉద్యోగం పొందారు. ఇంతవరకు ఇక్కడ ఇన్‌చార్జి ఎంపీడీవోగా పనిచేసిన బిరయ్య నుంచి ఆమె బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీలేఖ మాట్లాడుతూ... ప్రభుత్వం ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు త్వరగా, సక్రమంగా అందేలా కృషి చేస్తానని తెలిపారు. గ్రామ పంచాయతి కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది, నాయకులు కొత్త ఎంపీడీవోను కలిసి అభినందనలు తెలియజేశారు.