07-01-2026 11:50:07 AM
పతంగుల తయారీ వల్ల ఉపాధి కల్పన
హైదరాబాద్: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించనున్న ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్(Kite and Sweet Festival), హాట్ ఎయిర్ బెలూన్ షో, డ్రోన్ షోల గురించి మంత్రి జూపల్లి కృష్ణరావు(Minister Jupally Krishna Rao) సచివాలయంలో బుధవారం వివరించారు. రాష్ట్రంలో కనీస అవసరాలు లేని ప్రాంతాలు చాలా ఉన్నాయని మంత్రి తెలిపారు. పర్యాటక, మెడికల్, ఎకో, టెంపుల్, టూరిజంలో పెట్టుబడులు ఆకర్షిస్తున్నాయని చెప్పారు. మిస్ వరల్డ్ పోటీల సమయంలో రకరకాల విమర్శలు చేశారని గుర్తుచేశారు. తెలంగాణ గొప్పదనం ప్రపంచానికి చాటిచెప్పేందుకు పోటీలు నిర్వహించినట్లు వివరించారు.
తెలంగాణ గొప్పదనాన్ని విజయవంతంగా విదేశాలకు చాటిచెప్పామన్నారు. మిస్ వరల్డ్ పోటీల్లో(Telangana Miss World competition) పాల్గొన్నవారు పర్యాటక ప్రాంతాలు సందర్శించారని తెలిపారు. పెద్దఎత్తున బతుకమ్మ నిర్వహించి గిన్నిస్ రికార్డు నెలకొల్పామని సూచించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో పెద్దఎత్తున కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కైట్ ఫెస్టివల్(Kite Festival)లో విదేశాల నుంచి చాలా మంది పాల్గొంటున్నారని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతో చేసే పతంగులు మన వద్దే రూపొందించాలని ఆదేశించారు. మన వద్దే కొత్త పరిజ్ఞానంతో పతంగుల తయారీ వల్ల ఉపాధి కల్పించాలని సూచించారు. వచ్చే ఏడాది విదేశాలకు మించిన రీతిలో పతంగుల తయారీ జరగాలన్నారు. కైట్ ఫెస్టివల్ లో 19 దేశాల నుంచి 40 మంది కైట్ ఫ్లయర్స్, భారత్ నుంచి 15 రాష్ట్రాల కైట్ ఫ్లయర్స్ పాల్గొంటున్నారని తెలిపారు. రాత్రి వేళల్లోనూ వెలుగులు విరజిమ్మేలా కైట్ ఫ్లై ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణరావు సూచించారు.