19 March, 2026 | 3:55 AM

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలి

19-03-2026 02:30 AM

మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు డిమాండ్

విజయవాడ, మార్చి 18 (విజయక్రాంతి): దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని మాజీ డీజీపీ డాక్టర్ జె పూర్ణచంద్రరావు, ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ, క్రైస్తవ కోఆర్డినేషన్ కౌన్సిల్ ప్రతినిధులు, కమ్యూని టీ నాయకులు డిమాండ్ చేశారు. ఏపీలో వరుసగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఈ సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యాయని వారు ఆందోళన వ్యక్తం చేశా రు.

బుధవారం మీడియాతో మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ.. గత కొన్ని దశాబ్దాలుగా కమ్మ, రెడ్డి వర్గాలకు చెందిన ముఖ్యమంత్రుల నేతృత్వంలోని ప్రభుత్వాలు కేంద్రం వద్ద అనుకూలంగా లేరని అందుకే ఏ ప్రయత్నం చేయలేదని ఆరోపించారు. జాతీయ స్థాయిలో రాజకీయ ప్రభావం ఉన్నప్పటికీ ఈ అంశానికి ప్రాధాన్యం ఇవ్వలేదని తెలిపారు.

ఈ డబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు చేసి కమ్మ, రెడ్డి కులాలకు  ప్రయోజనాలు కల్పించడంలో రాజకీ య నాయకత్వం వేగంగా, సమన్వయంతో పనిచేసిందని పేర్కొన్నారు. మాల, మాదిగ, ఇతర దళిత క్రైస్తవుల దీర్ఘకాలిక డిమాండ్‌ను పట్టించుకోలేదని విమర్శించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు త్వరగా అమలు చేసినప్పుడు, దళిత క్రైస్తవులకు ఏడు దశాబ్దాలుగా ఎస్సీ హోదా కల్పించడంలో ఎందుకు విఫలమయ్యారు? అని ప్రశ్నించారు.

మాల మాదిగ  క్రైస్తవులు ఇంకా అంటరానితనం, సామాజిక వేరుచేయడం, ఆర్థిక వెనుకబాటుతనం సమస్యలను ఎదు ర్కొంటున్నా మతం ఆధారంగా ఎస్సీ హోదా నిరాకరించడం వివక్షేనని పేర్కొన్నారు. రాజ్యాంగ సూత్రా లకు అనుగుణంగా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ దేశానికి అనేక ప్రభావవంతమైన జాతీయ నాయకులను అందించిందని, ఈ సమస్య పరిష్కారం ఆలస్యం కావడం శక్తి లోపం వల్ల కాదని, రాజకీయ చిత్తశుద్ధి లోపమే కారణమని తెలిపారు. వరుస ప్రభుత్వాల సీఎంలు చంద్ర బాబు, జగన్‌మోహన్‌రెడ్డి ఏమాత్రం చొరవతీసుకోవడానికి ఇష్టపడటం లేదన్నారు.   

డా. జె. పూర్ణచంద్రరావు నాయకత్వంలో సా మ్యూల్ ఆనంద్‌కుమార్ (మాజీ ఐఏఎస్), అశోక్‌కుమార్ (క్రైస్తవకో ఆర్డినేషన్ కౌన్సిల్ అధ్యక్షు డు) కలిసి 1950 రాజ్యాంగ ఉత్తర్వులోని పేరా 3ను వెంటనే రద్దు చేసి, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. క్రిషియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ ప్రతినిధి బృందం రాష్ట్రపతికి ఉద్దేశించిన వినతిపత్రాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌కు అందజేశారు.