17-08-2025 11:58:36 AM
హైదరాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలపై జిల్లా అధికారులతో ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే పెన్ గంగా ఉదృతంగా ప్రవహిస్తున్నందున ముంపు ప్రాంతాలపై దృష్టి పెట్టాలన్నారు. వరద ప్రభావిత మండలాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఆర్డబ్లూఎస్, హెల్త్ అధికారులు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు.