calender_icon.png 17 August, 2025 | 12:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

17-08-2025 11:42:00 AM

కొయ్యలగూడెం: ఏలూరు జిల్లా(Eluru District) కొయ్యలగూడెం మండలం బయ్యన్న గూడెం వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొబ్బరికాయలు తీసుకెళ్తున్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కొబ్బరికాయలు తోలుతున్న వాహనం డ్రైవర్ రాజేష్, క్లీనర్ లక్ష్మణ్ అక్కడికక్కడే మృతి చెందారు. లారీ పాలకొల్లు నుండి హైదరాబాద్ కు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.  సంఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.