17-08-2025 10:46:25 AM
గురుగ్రామ్: హర్యానాలోని గురుగ్రామ్‌లో బిగ్‌బాస్(Bigg Boss) ఓటిటి(హిందీ) సీజన్-2 విజేత, ప్రముఖ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్(YouTuber Elvish Yadav) ఇంటిపై ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఉదయం 5.30 గంటల నుండి ఉదయం 6 గంటల మధ్య బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు ఎల్విష్ యాదవ్ ఇంటిపై 12 రౌండ్లకు పైగా బుల్లెట్లను కాల్చి పారిపోయారని పోలీసులు తెలిపారు. బుల్లెట్లు ఇంటి నేల, మొదటి అంతస్తులను తాకాయి.
ఎల్విష్ యాదవ్ భవనంలోని రెండు, మూడో అంతస్తులలో నివసిస్తున్నారు. కాగా, దాడి సమయంలో ఎల్విష్ యాదవ్ తన నివాసంలో లేరు. ఆ సమయంలో అతని కుటుంబ సభ్యులు, కేర్ టేకర్స్ ఇంటిలోపల ఉండగా.. ఎవరికి కూడా గాయలు కాలేదు. పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని, ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించి, సమీప ప్రాంతాల నుండి సీసీటీవి ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. ఈ సంఘటనకు ముందు యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ కి ఎటువంటి బెదిరింపులు రాలేదని బంధువులు తెలిపారు. ఎల్విష్ ప్రస్తుతం తన వ్యక్తిగత పనుల కోసం హర్యానాలో ఉన్నారు.