08-11-2025 01:17:44 PM
వాహనం నుండి మిరుగులు పడి పత్తికి నిప్పు
కుమ్రం భీం అసిఫాబాద్,(విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలంలోని బూరుగుడా పంచాయతీ పరిధిలోగల ఆర్ఎస్ జిన్నింగ్ మిల్లులో( RS Ginning Mill) ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం;పత్తి వాహనం అన్లోడ్ చేస్తుండగా వాహనం సైలెన్సర్ నుండి నిప్పు రవ్వలు పడడంతో పక్కనే ఉన్న పత్తికుప్ప అంటుకుంది గమనించిన లేబర్ నీటిని చల్లి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదంలో 60 కేజీల వరకు పత్తి దగ్ధమైనట్లు యజమాని తెలిపారు.