19 May, 2026 | 10:20 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

పంట క్షేత్రాల్లో వేలాదిగా నాటు కోళ్లు..!

08-11-2025 01:10 PM
  1. ఊరంతా నాటుకోడి కూరనే..
  2. వేలాదిగా కోళ్లను వదిలి వెళ్ళిన గుర్తుతెలియని వ్యక్తులు
  3. కోళ్ల కోసం పరుగులెత్తిన జనం
  4. కోళ్లకు వైరస్ దొరికిందని అనుమానం?

భీమదేవరపల్లి,(విజయక్రాంతి): పంట క్షేత్రాల్లో వేలాదిగా నాటు కోళ్లను(Natukollu) గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లిన సంఘటన శనివారం ఎల్కతుర్తిలో చోటుచేసుకుంది. హనుమకొండ జిల్లా(Hanumakonda District) ఎలుకతుర్తి మోడల్ స్కూల్ సమీపంలో సుమారు రెండు వేల వరకు నాటు కోళ్లను గుర్తు తెలియని వ్యక్తులు శనివారం వదిలి వెళ్లారు. గుర్తు తెలియని వ్యక్తులు నాటు కోళ్లను వదిలి వెళ్ళిన సంఘటన ఎల్కతుర్తి గ్రామంలో దావనంల వ్యాపించడంతో అనేకమంది గ్రామస్తులు కోళ్లను పట్టుకునేందుకు పంట పొలాల్లో పరుగులు తీశారు. కొంతమందికి ఒకటి రెండు కోళ్లు దొరకగా మరి కొంత మంది యువకులు ముందు చూపుతో ఇంటివద్ద నుండి తెచ్చుకున్న బ్యాగులో పదుల సంఖ్యలో కోళ్లను పట్టుకు వెళ్లారు. ఏది ఏమైనా ఎలుకతుర్తి గ్రామం మొత్తం నాటుకోడి కూర పులుసుతో గుమగుమ లాడుతున్నాయి. కాగా నాటు కోళ్లకు వైరస్ సోకడంతో గుర్తు తెలియని వ్యక్తులు కోళ్లను వదిలి వెళ్లారని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.