08-11-2025 01:31:02 PM
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు(Winter session of Parliament) డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 19 వరకు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు(Minister Kiren Rijiju) తెలిపారు. ఆ తేదీల్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలను ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ ప్రతిపాదనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu) ఆమోదించారని మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. "మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే, ప్రజల ఆకాంక్షలకు ఉపయోగపడే నిర్మాణాత్మక, అర్థవంతమైన సమావేశాల కోసం ఎదురు చూస్తున్నాను" అని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరగనున్న ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాలు చాలా కీలకం కానున్నాయి. ఈసారి కూడా అనేక సమస్యలతో సమావేశాలు అతలాకుతలం కావచ్చు. దేశవ్యాప్తంగా జరిగిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (Special Intensive Revision), హర్యానా, మహారాష్ట్రలలో జరిగిన ఓట్ చోరీ అంశంపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.