4 April, 2026 | 6:55 PM

వచ్చే మూడ్రోజులు అధికారులంతా విధుల్లో ఉండాలి

19-09-2025 01:05 PM

హైదరాబాద్ లో భారీ వర్షాలు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి పొన్నం టెలికాన్ఫరెన్స్

హైదరాబాద్: హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలు, తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar ) శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలు తీసుకుంటున్న చర్యలపై జీహెచ్ఎంసీ ,హైడ్రా,పోలీస్, ట్రాఫిక్, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్, జిల్లా రెవెన్యూ , విద్యుత్ ,హెల్త్  వివిధ విభాగాల అధికారులతో హైదరాబాద్ ఇన్ ఛార్జ్ మంత్రి(Minister in-charge of Hyderabad) సమీక్షించారు. నగరంలో గత మూడు రోజులుగా పలు ప్రాంతాల్లో తక్కువ సమయంలో ఎక్కువ వర్షం  కురుస్తుండటం ప్రజల ఇబ్బందులు పడుతుండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వచ్చే మూడు రోజుల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు విధుల్లో ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ఇబ్బందులు పిర్యాదులు వస్తే తక్షణమే స్పందించాలని మంత్రి సూచించారు. ప్రజలు పిర్యాదు చేసే టోల్ ఫ్రీ నెంబర్ లు టీవీ లు, సంజిక మాధ్యమాల  ద్వారా ప్రజలకు తెలిసేలా చేయాలని కోరారు.

పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని సూచించారు. రైల్వే అండర్ బ్రిడ్జిల వద్ద వాహనదారులు జాగ్రత్తగా వెళ్ళేల అక్కడ పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. భారీ వర్షం కురిసినప్పుడు వరద నీరు వెళ్ళేడానికి మ్యాన్ హోల్ లు ప్రమాదాలు జరగకుండా అక్కడ జీహెచ్ఎంసీ  సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి పొన్నం తెలిపారు. విద్యుత్ స్తంభాల ,విద్యుత్ తీగల వద్ద జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ మొబైల్ మెసేజ్ ల రూపంలో సందేశాలు పంపాలని ఆదేశించారు. వర్షం తీవ్రత అధికంగా ఉన్నప్పుడు అత్యవసరం అయితేనే బయటకు రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేయాలని అధికారులకు సూచించారు. తాగునీటి సరఫరా అయ్యే సమయంలో కచ్చితంగా మంచినీటి నాణ్యతను పరీక్షించాలని మంత్రి స్పష్టం చేశారు. ఎక్కడ తాగునీరు కలుషితం కాకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. బస్తీలు లోతట్టు ప్రాంతం మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. నగర ప్రజలు ఇలాంటి పరిస్థితులను మ్యాన్ హోల్ మూతలు తెరవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్న మంత్రి పొన్నం హైడ్రా, జీహెచ్ఎంసీ, పోలీసు, ఇతర విభాగాల అధికారులు సమన్వయం చేసుకుంటూ పని చేయాలి తెలిపారు.