calender_icon.png 3 July, 2025 | 9:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖమ్మం రూరల్ ఏసీపి కార్యాలయం భవనాన్ని ప్రారంభించిన మంత్రి పొంగులేటి

02-07-2025 08:16:39 PM

ఖమ్మం (విజయక్రాంతి): ఖమ్మం రూరల్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నూతన కార్యాలయం, ఆధునీకరించిన ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ భవనాన్ని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy), పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామిరెడ్డి(MP Ramasahayam Raghuram Reddy) బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ... బాధితులు నిర్భయంగా పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసే అనువైన పరిస్థితులు కల్పించేలా పోలీస్ స్టేషన్ లో ఉండాలని అన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అడిషనల్ డిసిపి ప్రసాద్ రావు, ఏసీపిలు తిరుపతిరెడ్డి, రమణమూర్తి పాల్గొన్నారు.