calender_icon.png 3 July, 2025 | 3:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం వద్ద అగ్నిప్రమాదం

03-07-2025 08:02:43 AM

అమరావతి: తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయ సమీపంలో(Govindaraja Swamy Temple) గురువారం భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) సంభవించింది. ఆలయం ముందు భాగంలో ఉన్న షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆలయం ముందు ఉన్న చలువ పందిళ్లకు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో రెండు దుకాణాలలోని ఇత్తడి సామాన్లు, బొమ్మలు దగ్ధమయ్యాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో భక్తులు భయంతో పరుగులు పెట్టారు. స్థానికుల సమాచారంతో మూడు అగ్నిమాపక యంత్రాలలో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. దీంతో పెద్ద ముప్పు తప్పింది. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్లు ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.