03-07-2025 02:07:58 AM
ప్రతికూల వాతావరణమే కారణం
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై ౨ (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళ వారం అర్ధరాత్రి ప్రతికూల వాతావరణం కారణంగా పలు విమానాల దారి మళ్లించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల వివిధ నగరాల నుంచి రావాల్సిన పలు విమానాలను దారి మళ్లించినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. లఖ్నో, కోల్‌కతా, ముంబయి, జైపూర్‌ల నుం చి శంషాబాద్‌కు వస్తున్న విమానాలను బెంగళూరులోని కెంపేగౌడ అం తర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు.
అలాగే, ఒక విమానాన్ని విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి దారి మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. బుధవారం ఉదయం వాతావరణం అనుకూలించడంతో దారి మళ్లించిన విమానాలన్నీ తిరిగి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాయి. ప్రస్తుతం శంషాబాద్‌లో విమాన కార్యకలాపాలు సాధారణం గా కొనసాగుతున్నాయని విమానాశ్రయ అధికారులు తెలిపారు.