12 April, 2026 | 4:41 PM

నాటి బాధలు ఇంతింత కాదు

03-07-2025 02:04 AM
  1. ఎమర్జెన్సీ కష్టాలపై మాక్ పార్లమెంట్  
  2. యువత, మహిళలు రాజకీయాల్లోకి రావాలి
  3. మాక్ పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి

హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): ఎమర్జెన్సీ కాలంలో ప్రజలు అనుభవించిన బాధలు ఇంతింత కాద ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నా రు. 1975లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ భారత రాజ్యాంగం, పౌరహక్కులకు తీవ్రమైన విఘాతం కలిగిం చిందని కేంద్ర మంత్రి విమర్శించారు. ఎమర్జెన్సీ కాలంలో ప్రజలు పడిన బాధలు, కష్టాలను నేటి తరానికి తెలిసేలా చేసేందుకు బీజేపీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపడుతు న్నామని తెలిపారు.

ఎమర్జెన్సీకి 50 ఏ ళ్లు పూర్తున సందర్భంగా బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని కేశవ మెమోరియల్ ఇన్‌స్టి ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కేఎంఐటీ)లో నిర్వహించిన మాక్ పార్లమెంట్’ సెషన్‌లో ఆయన పాల్గొన్నారు. ప్రజాస్వా మ్య విలువల పరిరక్షణ అనే అంశంపై వి ద్యార్థులు ప్రసంగించారు. ఈ సందర్భంగా ‘ది ఎమర్జెన్సీ డైరీస్’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా స్వామ్యాన్ని అణచివేసిన ఆ చారిత్రక సంఘటనను నేటి తరానికి గుర్తు చేయడమే ఈ మాక్ పార్లమెంట్ ఉద్దేశమ న్నారు. నైతిక విలువలతో కూడిన రాజకీయాల కోసం యువత, మహిళలు రాజకీయాల్లో ముందుకు రావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ప్ర ధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ చట్టంతో వచ్చే ఎన్నికల అనం తరం పార్లమెంటు, అసెంబ్లీల్లో మహిళల ప్రాతినిథ్యం మరింత పెరుగుతుం దని తెలిపారు.

అధికారం కోసం రాజ్యాంగం తారుమారు

అధికారం కోసమే రాజ్యాంగాన్ని తారుమారు చేసిన చరిత్ర కాంగ్రెస్ పా ర్టీదని ఎంపీ డీకే అరుణ అన్నారు. ఎమర్జెన్సీ దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఓ చీకటి అధ్యాయమని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో పత్రికా స్వేచ్ఛ ను హరించి, లక్షల మందిని జైలుకు పంపించారని, ప్రశ్నించిన గొంతులను అణిచేశారని విమర్శించారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ రక్షకులమంటూ ప్రచారం చేయడం విస్మ యానికి గురిచేస్తోందని వ్యాఖ్యానించారు.

గతాన్ని విస్మరించి, రాజ్యాంగ పుస్తకాన్ని చేతిలో పట్టుకొని తిరగడం సిగ్గుచేటన్నారు. ఈ తరం యువతకి ఎమర్జెన్సీ కాలం దారుణాలపై అవగాహన కల్పించడమే మాక్ పార్లమెంట్ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ర్ట ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, మహిళా మోర్చా రాష్ర్ట అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి,  నేతలు దీపక్ రెడ్డి, గౌతం రావు తదితరులు పాల్గొన్నారు.

 ఎంపీ డీకే అరుణ

 గొంతులు నొక్కాలని చూశారు

ఎమర్జెన్సీ సమయంలో పత్రికలపై నిషేధం, రాజకీయ నాయకుల అరెస్టులు, మీసా చట్టం ద్వారా నిర్బంధాలు జరిగాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు గుర్తుచేశారు. నిర్బంధాల ద్వారా గొంతులు నొక్కేయాలని అప్పటి కాంగ్రెస్ సర్కారు ప్రయత్నించిందన్నారు. అటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు, మహిళలు ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేశారని తెలిపారు.

మాక్ పార్లమెంట్‌లో పాల్గొన్న విద్యార్థులు చక్కటి లెజిస్లేటివ్ బిహేవియర్ ప్రదర్శించారన్నారు. రాజకీయాల్లో యువత, మహిళలకు విస్తృత అవకాశా లున్నాయని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మాక్ పార్లమెంట్ లాంటి కార్యక్రమాలు విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికితీసే శిక్షణ వేదికలుగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు.

 బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు