calender_icon.png 3 July, 2025 | 4:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాటేదాన్‌లో అగ్నిప్రమాదం

03-07-2025 08:57:37 AM

హైదరాబాద్: కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియాలోని(Katedan Industrial Area) రబ్బరు కర్మాగారంలో గురువారం తెల్లవారుజామున భారీఅగ్నిప్రమాదం(Fire Accident) సంభవించింది. ఈ సంఘటనలో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కార్ మ్యాట్స్, ఇతర రబ్బరు వస్తువులను తయారు చేస్తున్న కర్మాగారంలో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు.

సమాచారం మేరకు సమీపంలోని అగ్నిమాపక కేంద్రాల నుండి అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు చర్యలు ప్రారంభించారు. మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు(Mailardevpally Police), డీఆర్ఎఫ్(Disaster Response Force) బృందాలతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల కారణంగా భవనం నుండి దట్టమైన పొగ కమ్ముకుంది. పొగను గమనించిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉన్నాయని పేర్కొన్నారు.