calender_icon.png 3 July, 2025 | 9:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేత్రపర్వంగా బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం

03-07-2025 02:42:30 AM

  1. రథోత్సవాన్ని ప్రారంభించిన కోట నీలిమ
  2. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు
  3. భక్తులకు అసౌకర్యాలు కలుకుండా ఏర్పాట్లు

ఖైరతాబాద్, జూలై 2 (విజయక్రాంతి) : బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం బుధవారం సాయంత్రం నేత్రపర్వంగా సాగింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సతీమణి సుధాదేవ్ వర్మ, కలెక్టర్ హరిచందనతో కలిసి సనత్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోటా నీలిమ కొబ్బరికాయలు కొట్టి అమ్మవారి రథాన్ని లాగి రథోత్సవాన్ని ప్రారం భించారు.

ఈ సందర్భంగా రథం ముందు డప్పు చప్పుళ్లు, కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రథోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం, రథోత్సవం ప్రశాంతంగా నిర్వహించడంపై డాక్టర్ కోట నీలిమ అధికారులకు అభినందనలు తెలిపారు.

భక్తులు ఎలాంటి అసౌకర్యా నికి, ఇబ్బందులకు గురికాకుండా ఏర్పాట్లను చేసిన జీహెచ్‌ఎంసీ, విద్యుత్, దేవాదాయ శాఖ, పోలీస్, ట్రాఫిక్ పోలీస్, ఆర్‌అండ్బీ, వాటర్ వర్స్, సమాచార శాఖ, అగ్నిమాపక శాఖ అధికారులను అభినందించారు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, భక్తులకు సేవలు చేసిన వలంటీర్లను మెచ్చుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడి యా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.

ఆలయ బోర్డు సభ్యురాలు గోడాస్ ఉమారాణి ప్రత్యేక ఆహ్వానం

సనత్ నగర్, జూలై 2 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ఆధ్యాత్మికంగా ప్రత్యేకమైన స్థా నం ఉన్న బల్కంపేట శ్రీ ఎల్ల మ్మ తల్లి కళ్యాణ మహోత్సవంలో గం డిపేట ఎంఫ్టీసీ సభ్యురాలు గోపా ల సునిత భక్తితో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన పవిత్ర రథోత్సవ కార్యక్రమంలో ఆమె హాజరై అమ్మవారి దివ్య దర్శనం చేసుకున్నారు.

ఈ కార్యక్రమానికి బల్కంపేట దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలు గోడాస్ ఉమారాణి గోపాల సునితని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గోపాల సునిత మాట్లాడుతూ ఎల్లమ్మ తల్లి కళ్యాణం సమయం లో ఆలయంను దర్శించడం నాకు చాలా ధన్యతను కలిగించింది. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలకు శాంతి, ఆరోగ్యం, సమృద్ధి కలగాలని వారు ఆకాంక్షించారు.