10 August, 2026 | 9:25 PM

జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. త్వరలో స్థలాలు: మంత్రి పొంగులేటి

19-06-2024 01:56 PM

‌హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర మరవలేనదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో జర్నలిస్టులకు చేసిందేమీలేదని ఆరోపించారు. ఖమ్మంలో టీయూడబ్ల్యూజే ఐజేయూ రాష్ట్ర తృతియ మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ... అతి కొద్ది రోజుల్లోనే హైదరాబాద్ జర్నలిస్టులకు కేటాయించిన స్థలం ఇస్తామన్నారు. ఖమ్మం జిల్లా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు. అక్రిడేషన్ కార్డులు మరో మూడు నెలలు పొడిగిస్తున్నామని పేర్కొన్నారు. హెల్త్ కార్డుల అంశంపై సీఎంతో చర్చించి నిర్ణయిస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని పొంగులేటి హామీ ఇచ్చారు. ఈ మహాసభలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలు, జర్నలిస్టులు రామోజీరావుకు ఘన నివాళి అర్పించారు.