పవన్ చేతికి పవర్.. మొదటి సంతకం ఆ ఫైల్ పైనే
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం విజయవాడలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన కీలక ఫైల్స్ పై సంతకం చేశారు. ఉపాధి హామీ పథకాన్ని ఉద్యానవన సంబంధిత పనులకు అనుసంధానించి నిధులు మంజూరు చేస్తూ మొదటి ఫైల్‌పై, గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణానికి సంబంధించిన రెండో ఫైల్ పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంతకం చేశారు. వేదమంత్రోచ్ఛారణలతో జరిగిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు.
పవన్ కల్యాణ్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పలువురు జనసేన నాయకులు, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనసేన అధినేతకు పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన మొత్తం 21 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించి 100 శాతం స్ట్రైక్‌రేట్‌ను సాధించింది.






