10 August, 2026 | 8:12 PM

తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం

19-06-2024 02:24 PM

హైదరాబాద్: దేశంలో తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. వ్యవసాయాధారిత పరిశ్రమలు, సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ పార్కుల అభివృద్ధికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అర్బన్, సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాలను క్లస్టర్లుగా విభజించి అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ధాన్యం, మొక్కజోన్న పంట ఉత్పత్తులకు డిమాండ్ రాబోతుందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించారు.

వ్యవసాయ రంగానికే రాష్ట్ర ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తోందని భట్టి విక్రమార్క అన్నారు. బ్యాంకులు ప్రాధాన్యత రంగాలకు ఇచ్చే రుణ పరిమితిని సాధించడం సంతోషకరమన్నారు. వ్యాపార రంగం అభివృద్ధిలో బ్యాంకులదే కీలక పాత్ర అని, అప్పు తీసుకోవడలం అభివృద్ధిలో భాగమన్నారు. వ్యవసాయం, ఫార్మా, స్థిరాస్తి రంగాలకు వెంటనే రుణాలు ఇవ్వాలని భట్టివిక్రమార్క కోరారు. హైదరాబాద్ లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. వ్యవసాయ రంగానికి కేటాయింపులు పెంచాలని మంత్రిలు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.