calender_icon.png 29 October, 2025 | 3:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహబూబ్‎‎నగర్‎‎ జిల్లాలో భారీ వర్షం

29-10-2025 12:50:54 PM

  1. ఇప్పటికే నిండిన చెరువులు, కుంటలు
  2.  పొంగిపొర్లుతున్న వాగులు
  3.  జడ్చర్ల ఇండ్ల మధ్యలో నిలిచిన వర్షపు నీరు
  4.  వర్షాలు కురిసినప్పుడే చర్యలు అంటున్న ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): కారణం ఏదైనా ఈ ఏడాది వర్షాకాలం నిండుకుండలా మారింది. వర్షాకాలం ప్రారంభ దశలోనే చెరువులు కుంటలు వర్షపు నీటితో పొంగి పొర్లాయి. నాటు నుంచి వర్షాకాలం ముగిసి నిలనాటు నుంచి వర్షాకాలం ముగిసి నెల గడుస్తున్నప్పటికీ తుఫాన్ కారణంగా మరో మారు వర్ష బీభత్సం సృష్టించింది. జిల్లావ్యాప్తంగా వర్షం అర్ధరాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తుంది. ముసురు వర్షంతో ఆరంభమైన తుఫాన్ ప్రభావం ఏకధాటిగా కురుస్తుంది. అప్పుడప్పుడు వర్ష ప్రభావము అరగంట సమయం విరామం ఇచ్చినప్పటికీ ఆ ప్రభావం మాత్రం జిల్లా వ్యాప్తంగా భారీగా పడింది.  జడ్చర్లలో లోతట్టు ప్రాంతాలలో వర్షపు నీరు నిలిచింది. ముందస్తుగా పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు ఇంటికే పరిమితం కావడంతో కొంత ఉపశమనం లభించిందని చెప్పాలి. జడ్చర్లలో ఓ పాఠశాలకు సంబంధించిన బస్సు రోడ్డుకు ఒక పక్కకు పొంగడంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే నిలిపి విద్యార్థులను బస్సు నుంచి దింపి వేసిన సంఘటన చోటుచేసుకుంది. జడ్చర్ల లోని పద్మావతి కాలనీలో ఇండ్ల మధ్యనే నీరు నిలిచిపోయింది. 

ఆగం ఆగం అవుతున్న అన్నదాత..

వరి పంటతో పాటు మక్కా, కంది పంట లు మరిన్ని పంటలు కూడా చేతికి వచ్చే దశకు చేరుకున్నాయి. కురుస్తున్న వర్షాలతో వరి పంట నేలకొరుగుతుంది. ఈ ప్రభావం మరో రెండు, మూడు రోజులు కూడా ఉంటే రైతన్న మరింత నష్టపోయే పరిస్థితి నెలకొంటుంది. ఏదేమైనా కురుస్తున్న వర్షాలు రైతులతోపాటు ప్రజలను ప్రజలకు చేస్తున్నాయి. ఇప్పటికే చెరువులు కుంటలు నిండడంతో కురుస్తున్న వర్షాలతో మరింత అద్భుతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ప్రజాప్రతినిధులు వర్షాలు కురుస్తున్నప్పుడు హామీలు ఇచ్చినప్పటికీ అవి కేవలం వర్షాలకు పడినప్పుడు మాత్రమే నోటి మాటగా వస్తున్నాయని ఆచరణలో మాత్రం అమలు జరగడంలేదని ప్రజలు చెబుతున్న మాట. ఇప్పటికైనా లోతట్టు ప్రాంతాలతో పాటు వర్షపు నీటికి ప్రభావితం చేసే ప్రాంతాలలో నీరు నిలవకుండా ప్రజాప్రతినిధులు అధికారుల ద్వారా పూర్తిస్థాయిలో నివారణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.